![]() |
![]() |

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిని టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్ కలిసి వచ్చినప్పట్నుంచీ, అక్కడ మన స్టార్ల వ్యవహారశైలిని చూసినప్పట్నుంచీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూ, వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. మెగా, సూపర్, బాహుబలి స్టార్లు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడమని జగన్‌ను అడుక్కున్నంత పనిచేశారని ట్వీట్ చేసి, చర్చకు తెరలేపిన వర్మ, రీసెంట్‌గా మరోసారి వరుస ట్వీట్లతో టాలీవుడ్ స్టార్లను చిన్నబుచ్చేశారు. జగన్‌ను 'ఒమెగా స్టార్' అని సంబోధించిన ఆయన, చిరంజీవి, మహేశ్, ప్రభాస్‌లను జూనియర్ ఆర్టిస్టుల కింద తీసిపడేశారు.
పబ్లిక్‌లో చాలా ఆర్డినరీ మెంబర్లు అయిన వై.ఎస్. జగన్, పేర్ని నాని అందరు సూపర్, మెగా, బాహుబలి స్టార్ల కంటే చాలా పెద్ద స్టార్లు మాదిరిగా కనిపిస్తున్నారనీ, ఎందుకంటే బెగ్గింగ్ రీల్ స్టార్లు చాలా భక్తితో ట్వీట్లు చేశారనీ, కానీ రియల్ స్టార్లయిన జగన్, పేర్ని నాని కనీసం ట్వీట్లు కూడా చేయలేదనీ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఆర్జీవీ చేసిన మరికొన్ని ట్వీట్లు...
"వై.ఎస్. జగన్ రియల్ మెగా సూపర్ డూపర్ ఒమెగా స్టార్. ఈ విషయాన్ని మహేశ్, చిరంజీవి, ప్రభాస్ వగైరా వగైరా ఒమెగాస్టార్ చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల మాదిరిగా కూర్చొని నిరూపించారు."
"రీల్ ఫిల్మ్‌లో మహేశ్, చిరంజీవి, ప్రభాస్ వగైరాలు ఫ్రేమ్ సెంటర్‌లో ఉండి పంచ్ డైలాగ్స్ ఇస్తారు. రియల్ లైఫ్‌లో వై.ఎస్. జగన్ ఫ్రేమ్ సెంటర్‌లో ఉంటే, వాళ్లు భయపడుతూ బిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల మాదిరిగా అడుక్కుంటున్నారు. స్టార్ల కంటే తానే ఎత్తులో ఉన్నానని జగన్ చూపించారు."
"గౌరవనీయ ముఖ్యమంత్రి ఒమెగా స్టార్ వై.ఎస్. జగన్ గారిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, అందరు సూపర్ మెగా స్టార్లు ఒకే లైన్‌లో 'హీరోలు జీరోల'ని ఆయన ప్రూవ్ చేశారు."
"హీరోలందరూ భిక్షాటన పాత్ర తీసుకొని వెళ్లి, ఆయన దేవుడంటూ కీర్తించారు. అలా, ఒమెగా స్టార్ మాత్రమే అసలైన పవర్‌ఫుల్ స్టార్ అని తమ ఫ్యాన్స్‌కు వారు నిరూపించారు."
"దేవుడు తన భక్తుల కోరికను తీర్చడం మాదిరిగా కొన్ని రేట్లను పెంచడానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆఖరి ధరల పెరుగుదల అంతంత మాత్రమే అయినప్పటికీ, స్టార్లు నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే వారు ఇప్పటికే ఆయనను ఒమెగా స్టార్‌గా పట్టాభిషేకం చేశారు."
"తన సొంత ఇండస్ట్రీ వాళ్ళు కూడా పవర్ లెస్ స్టార్‌ని పట్టించుకోవడం లేదని, దీని ద్వారా ఒమెగా వేరియంట్ సూపర్, మెగా, బాహుబలి, సర్కార్ మిక్స్ వేరియంట్ కంటే చాలా పవర్‌ఫుల్ అని నిరూపిస్తూ రాష్ట్రం మొత్తం దృష్టిని ఒమెగా స్టార్ ఆకర్షించారు."
"నేను ఒమెగా స్టార్‌కి మరింత పెద్ద అభిమానిని అయ్యాను. ఎందుకంటే ఆయన చాలా సమర్ధవంతంగా పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ తానే నిజమని గుర్తించేలా చేశారు, ఆయన తన ప్రాథమిక లక్ష్యాన్ని కోల్పోకుండా చేశారు. ఇప్పటి నుండి ఒమెగా స్టార్‌ని ఒమెగా పవర్‌స్టార్ అని పిలవాలని నేను అనుకుంటున్నాను."
అంటూ వరుస ట్వీట్లతో ఆర్జీవీ అందరి దృష్టినీ ఆకర్షించారు.
![]() |
![]() |