![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ఫిల్మ్ ని తెలుగుతో పాటు హిందీలోనూ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ 'భీమ్లా నాయక్' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'భీమ్లా నాయక్' చూస్తుంటే 'అయ్యప్పనుమ్ కోషియం' గుర్తుకురాదని, సినిమాలో త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపిస్తుందని అన్నారు. ఒరిజినల్ లో లేని చాలా కొత్త ఎలిమెంట్స్ 'భీమ్లా నాయక్' ఉంటాయని చెప్పారు.
'భీమ్లా నాయక్' విడుదల తేదీపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, అందరితో చర్చించి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని నాగవంశీ తెలిపారు. అలాగే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని నాగవంశీ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |