![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ 'కళావతి' సాంగ్ ప్రోమోని శుక్రవారం విడుదల చేశారు. "వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ.. ఉందో అటు పక్కో ఇటు దిక్కు చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయ" అంటూ సాగిన సాంగ్ ప్రోమో ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ప్రోమోలో మహేష్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలర్ ఫుల్ గా ఉన్న సాంగ్ ప్రోమో 'కళావతి' సాంగ్ పై అంచనాలు పెంచేసింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు మహేష్.
![]() |
![]() |