![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రముఖుల బృందం గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను శుభం కార్డు పడినట్లే అంటూ భేటీ అనంతరం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో టికెట్ ధరల తగ్గింపుపై మొదటి నుంచి బలమైన స్వరం వినిపించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ భేటీపై తనదైన శైలిలో స్పందించారు. సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్లే ఇది సాధ్యమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీపై ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ స్పందించారు. సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఇది జరిగిందని అభిప్రాయపడ్డారు. ఒమెగా స్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించడం సంతోషంగా ఉందని అన్నారు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి వైఎస్ జగన్ ను తాను అభినందిస్తున్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
.webp)
అలాగే ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులకు తెరదించి, భవిష్యత్ లో అంతా సాఫీగా సాగేందుకు కృషి చేస్తున్న వైఎస్ జగన్ ను అభినందిస్తున్నానని ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
![]() |
![]() |