Home  »  News  »  మహేష్ కి మెగాస్టార్ స్పెషల్ విషెస్!

Updated : Feb 10, 2022

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకటిగా మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంటకు పేరుంది. మహేష్, నమ్రతా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకునే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. నేడు(ఫిబ్రవరి 10) ఈ జంట పెళ్లి రోజు. ఈ సందర్భంగా మహేష్ ట్విట్టర్ వేదికగా నమ్రతకు విషెస్ తెలిపారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ జంటకు స్పెషల్ విషెస్ తెలపడం విశేషం.

ట్విట్టర్ లో ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసిన మహేష్.. "అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు నమ్రత. మనం ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలి." అని మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో కుమారుడు గౌతమ్ భుజంపై మహేష్ చేయి వేయగా, కుమార్తె సితారను నమ్రతా హత్తుకుని ఉండటం కనిపించింది.

మహేష్- నమ్రతా పెళ్లిరోజు సందర్భంగా మహేష్ కి స్వయంగా బొకే ఇచ్చి చిరంజీవి విషెస్ తెలిపారు. ఈరోజు సినీ పరిశ్రమ సమస్యల గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చించడానికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు వెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో మహేష్ కూడా ఉన్నారు. చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లారు. ఆ సమయంలో మహేష్ కి బొకే ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ఈ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసిన చిరంజీవి.. మహేష్-నమ్రతా జంటకి విషెస్ చెప్పారు. "అత్యంత ప్రియమైన జంటలలో ఒకరు మహేష్ - నమ్రతలకు 17వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ ఇద్దరికీ జీవితాంతం ప్రేమ, ఆనందం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.