![]() |
![]() |

'రాజావారు రాణివారు', 'SR కళ్యాణ మండపం' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్స్ ని అందుకున్న గీతా ఆర్ట్స్ 2 .. ప్రొడక్షన్ నెం 7గా కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాను నిర్మించనుంది. కిరణ్ అబ్బవరంకు కూడా ఇది 7వ సినిమా కావడం గమనార్హం. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జనవరి 7 ఉదయం 10.19 నిమిషాలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరగనున్నాయి. ఈ సినిమా డైరెక్టర్, టైటిల్ తో పాటు మరికొన్ని వివరాలను కూడా రేపు(శుక్రవారం) ప్రకటించనున్నారు.

కిరణ్ అబ్బవరం చేతిలో 'సెబాస్టియన్', 'సమ్మతమే' తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా గీతా ఆర్ట్స్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
![]() |
![]() |