![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా మెగా కాంపౌండ్ లోని స్టార్స్ అందరితోనూ జోడీ కట్టిన నాయికలుగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా చిరుతో మరోమారు జంటగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కాజల్, తమన్నా తరహాలోనే మరో హీరోయిన్ కూడా `మెగా రౌండప్` అంకం పూర్తిచేసుకునేందుకు సిద్ధమైంది. ఆ నాయిక మరెవరో కాదు.. చెన్నై పొన్ను శ్రుతి హాసన్. ఇప్పటికే పవన్ తో `గబ్బర్ సింగ్`, `కాటమ రాయుడు`, `వకీల్ సాబ్`.. చరణ్ తో `ఎవడు`, బన్నీతో `రేసు గుర్రం` చేసిన శ్రుతి - త్వరలోనే చిరంజీవికి జోడీగానూ దర్శనమివ్వనుందని సమాచారం.
Also Read: మహేశ్, తారక్, చరణ్ తరహాలోనే బన్నీకి కూడా..!
ఆ వివరాల్లోకి వెళితే.. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా శ్రుతి నటించబోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడు శ్రుతి హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్టేనట. అంతేకాదు.. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో మిస్ హాసన్ కనిపిస్తుందని అంటున్నారు. త్వరలోనే చిరు - బాబీ మూవీలో శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
మరి.. కాజల్, తమన్నా తరహాలో శ్రుతి కూడా మెగాస్టార్ కాంబోలో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |