![]() |
![]() |

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ(87) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇటీవల కైకాల ప్రమాదవశాత్తు ఇంట్లో కాలు జారిపడగా సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. కైకాల కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందినవారు, అభిమానులు కోరుకుంటున్నారు.
1959 లో 'సిపాయి కూతురు' సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల.. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ లో 700 లకు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు.
![]() |
![]() |