![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే విభిన్న చిత్రాల్లో `మంచుపల్లకీ` ఒకటి. తమిళ చిత్రం `పాలైవన సోలై` (1981)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు వంశీ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. మాతృకలో నాయికగా నటించిన సుహాసిని.. తెలుగు వెర్షన్ లోనూ అదే పాత్రని పోషించారు. అంతేకాదు.. చిరుతో సుహాసిని జట్టుకట్టిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. యువత మనోభావాలకు దర్పణం పట్టిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీశ్, నారాయణ రావు, సాక్షి రంగారావు, పి.ఎల్. నారాయణ, అన్నపూర్ణ, దేవదాస్ కనకాల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాజన్ - నాగేంద్ర బాణీలకు శ్రీ శ్రీ, వేటూరి, మైలవరపు గోపీ సాహిత్యమందించారు. పాటల్లో ``మనిషే మణిదీపం``, ``మేఘమా దాహమా``, ``విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్`` బహుళ ప్రజాదరణ పొందాయి. యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు, హరి అనుమోలు ఛాయాగ్రహణం.. ఈ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి. గోదావరి చిత్ర పతాకంపై ఎం. ఆర్. ప్రసాద్ రావు ఈ రొమాంటిక్ డ్రామాని నిర్మించారు. 1982 నవంబర్ 19న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మంచుపల్లకీ`.. నేటితో 39 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెట్టింది.
![]() |
![]() |