![]() |
![]() |

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక దీపావళి కానుకగా ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5'లో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టాడు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. ఓటీటీలో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. జీ 5లో విడుదలైన 7 రోజుల్లో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్హ వర్దన్ తదితరులు నటించారు.
![]() |
![]() |