![]() |
![]() |

ఈ వీకెండ్‌లో దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌తో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో, ఆయన ఇంటిపై బాంబు దాడి జరగబోతోందంటూ చెన్నై పోలీసులకు ఓ హెచ్చరిక వచ్చింది. చెన్నై, నీలాంకరైలో ఉన్న విజయ్ ఇంటిపై బాంబు దాడి జరగనున్నదంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. ఆ కాల్ వచ్చిన వెంటనే ఒక డాగ్ స్క్వాడ్, ఒక బాంబ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి వెళ్లారు.
"విజయ్ ఇంటిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశోధించాం. బాంబులు కానీ, ఇతర ఏ రకమైన పేలుడు పదార్థాలు కానీ అక్కడ లభించలేదు. విజయ్ ఇంటిపై బాంబుదాడి అనేది బూటకపు బెదిరింపు ఫోన్ కాల్ అని తేలింది." అని చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు చెందిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. తమ ఇన్వెస్టిగేషన్‌లో ఆ బూటకపు కాల్ విల్లుపురమ్ జిల్లా నుంచి వచ్చినట్లు, ఫోన్ చేసిన వ్యక్తి పేరు భువనేశ్వరన్ అని గుర్తించినట్లు ఆ ఆఫీసర్ వెల్లడించారు.
"ఆ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాం" అని ఆ ఆఫీసర్ చెప్పారు. భువనేశ్వరన్ అనే వ్యక్తి తరచూ ఈ తరహా పనులకు పాల్పడుతుంటాడని కూడా తెలిసింది. తను నిర్వహించిన ఒక ప్రోగ్రామ్‌లో ఒక పోటీలో విజేతలుగా నిలిచినవారితో విజయ్ ఫొటోలు దిగుతున్నప్పుడు భువనేశ్వరన్ బెదిరింపు కాల్ చేశాడు.
![]() |
![]() |