![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళం సూపర్‌హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్‌కు కొన్ని మార్పులు, చేర్పులతో భీమ్లా నాయక్‌ను తీర్చిదిద్దుతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఈ మూవీకి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఇప్పటిదాకా జరిగిన సన్నివేశాల ఎడిటింగ్ ఫుటేజ్ చూసిన పవన్ కల్యాణ్ బాగా ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయనకు సినిమాటోగ్రఫీ విపరీతంగా నచ్చేసింది. సెట్స్ మీద రవిచంద్రన్‌కు ఒక పూల బొకే బహూకరించడంతో పాటు, ఆయనను మెచ్చుకుంటూ ఓ నోట్‌ను కూడా అందజేశారు. దాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రవిచంద్రన్ షేర్ చేశారు.
"భీమ్లా నాయక్ ఎడిటెడ్ ఫుటేజ్‌ను చూశాక తన అభిప్రాయాలను మహోన్నత తీరుతో పవన్ కల్యాణ్ గారు వ్యక్తం చేసిన తీరు గొప్పగా అనిపించింది. అంతేకాదు.. పీకే తమ చేత్తో రాసిన ఒక వండర్‌ఫుల్ నోట్ కూడా ఇచ్చారు. ఆయనా, త్రివిక్రమ్ కలిసి ఈరోజు నాదాన్ని చేశారు." అంటూ ట్వీట్ చేశారు.
"డియర్ రవి కె. చంద్రన్ సార్, మీ విజువల్ బ్రిలియన్స్ అద్భుతం. 'భీమ్లా నాయక్'లో మీరు భాగమైనందుకు థాంక్యూ. మీ పనితనంతో డిఫరెన్స్ చూపించారు. అది చాలా కీలకమైంది." అని ఆ నోట్‌లో రాశారు పవన్ కల్యాణ్.

![]() |
![]() |