![]() |
![]() |

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని కొట్టిన వారికి క్యాష్ ప్రైజ్ ఇస్తామని ఓ హిందూ సంస్థ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన్ని కొట్టే ఒక్కో దెబ్బకి 1001 రూపాయలు బహుమతిగా ఇస్తామని 'హిందూ మక్కల్ కట్చి' అని పిలువబడే ఒక హిందూ సంస్థ సంచలన ప్రకటన చేసింది.
ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి సేతుపతిని వెనక నుంచి తంతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన సేతుపతి.. ఆ వ్యక్తి మద్యం మత్తులో తమతో గొడవ పడ్డాడని, తర్వాత క్షమాపణలు చెప్పాడని తెలిపారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని 'హిందూ మక్కల్ కట్చి' నేత అర్జున్ సపంత్ అంటున్నారు.
తేవర్ అయ్యను అవమానించిన విజయ్ సేతుపతిని కొట్టినవారికి క్యాష్ ప్రైజ్ ఇస్తామని అర్జున్ సపంత్ ప్రకటించినట్లుగా 'హిందూ మక్కల్ కట్చి' ట్విట్టర్ ద్వారా తెలిపింది. సేతుపతి క్షమాపణలు చెప్పేవరకు, ఒక్కో దెబ్బకి 1001 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పినట్లుగా ట్వీట్ లో పేర్కొంది. ఈ ప్రకటనపై అర్జున్ సంపత్ ను మీడియా సంప్రదించగా.. తానే ప్రకటించానని ఆయన అంగీకరించారు. తేవర్ అయ్య ను అవమానించినందుకే ఇలా మాట్లాడినట్లు తెలిపారు. అంతేకాదు, ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిపై దాడి చేసిన మహాగాంధీతో తాను మాట్లాడానని.. తేవర్ అయ్యపై వ్యంగంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై దాడి చేసినట్లు మహాగాంధీ తెలిపాడని అర్జున్ సంపత్ అన్నారు. మరి ఈ వివాదంపై విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |