![]() |
![]() |

తన కూతురికి జరిగిన అన్యాయానికి.. స్టెత్ పట్టే ఓ డాక్టర్ కత్తి పట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్న పాయింట్ తో రూపొందిన చిత్రం `సర్పయాగం`. నటభూషణ శోభన్ బాబు, రోజా తండ్రీకూతుళ్ళుగా నటించిన ఈ రివెంజ్ డ్రామాలో వాణీ విశ్వనాథ్, రేఖ, సాయికుమార్, శ్రీనివాస్ వర్మ, నగేశ్, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సుత్తి వేలు, జయలలిత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
విద్యాసాగర్ బాణీలు కట్టిన ఈ చిత్రానికి డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహిత్యమందించారు. ``దిగు దిగు దిగు`` (చిత్ర), ``ఏబీసీడీ గుండెలో``(బాలు, పి. సుశీల), ``చుబ్రం చేయనా``(బాలు, పి. సుశీల), ``చుక్క చుక్క``(బాలు), ``కుంకుమ పూబోణి`` (బాలు).. ఇలా ఇందులోని గీతాలన్ని అలరించాయి. 1991 నవంబర్ 1న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సర్పయాగం`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |