![]() |
![]() |

స్టన్నింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేసినప్పుడు ఆమె ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. వారంతా పెళ్లి కూతురిగా కాజల్‌ను చూడ్డానికి ఉవ్విళ్లూరారు. 2020 అక్టోబర్ 30న తన ఇంటీరియర్ డిజైనర్ బాయ్‌ఫ్రెండ్ గౌతమ్‌ను ఇటు పంజాబీ, అటు కశ్మీరీ సంప్రదాయాల ప్రకారం పెళ్లాడింది కాజల్.
సో.. ఈ అక్టోబర్ 30న వారు తమ వివాహ తొలి వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భర్త గౌతమ్‌కు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాభినందనలు తెలియజేసింది కాజల్. బ్లాక్ డ్రస్‌లో గౌతమ్‌తో ఉన్న ఒక చూడముచ్చటైన ఫొటోను షేర్ చేసిన ఆమె, "అర్ధరాత్రి నువ్వు మేలుకొని వున్నావా? నేను ఈ డాగ్ వీడియోను నీకు చూపించాలని నువ్వు గుసగుసలాడినప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ జీవితంలో జరిగిన ఒక బెస్ట్ థింగ్ నుంచి హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ గౌతమ్" అని రాసుకొచ్చింది.
మరోవైపు, గౌతమ్ కూడా కాజల్‌తో ఒక ఫొటోను షేర్ చేసి, ఆమెతో తన జీవితం ఎంత హాయిగా ఉందో వెల్లడించాడు. అతనేమని రాశాడంటే, "హ్యాపీ యానివర్సరీ మై లవ్. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలీదు. కానీ ఇది నా జీవితంలో అత్యంత అద్భుతమైన కొత్త అధ్యాయం. మీ బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్, మార్నింగ్ 4 గంటల ఫ్రెండ్, వర్కవుట్ ఫ్రెండ్, ట్రావెల్ పార్టనర్.. అంతా ఒక్కరే అయితే జీవితం సులభతరమైపోతుంది. మున్ముందు వచ్చే వాటికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా."

![]() |
![]() |