![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు రోజుల క్రితం రజనీకాంత్ హాస్పిటల్ పాలయ్యారు. ఆయన నిస్సత్తువకు గురయ్యారని వెల్లడించిన డాక్టర్లు నిన్న కార్టోటిడ్ ఆర్టెరీ రివాస్క్యులరైజేషన్ ఆపరేషన్ (హార్ట్ సర్జరీ)ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆయన కోలుకుంటున్నారనీ, కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవనున్నారనీ తెలిసింది. తన ఫ్రెండ్ రజనీ త్వరగా కోలుకుంటాడనే ఆశాభావాన్ని కమల్ హాసన్ వ్యక్తం చేశారు.
కాగా, తమ ఆరాధ్య నటుడు త్వరగా కోలుకుని సంపూర్ణారోగ్యంతో తమ ముందుకు రావాలని కోరుతూ లక్షలాది మంది రజనీ అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఆయన త్వరగా రికవర్ కావాలంటూ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అతి త్వరలోనే తమ తలైవర్ ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని వారంతా ఆశిస్తున్నారు.
రజనీకాంత్ టైటిల్ రోల్ చేసిన అణ్ణాత్త నవంబర్ 4న దీపావళి పర్వదినం సందర్భంగా విడుదలవుతోంది. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో పెద్దన్న టైటిల్‌లో రిలీజవుతోంది.
![]() |
![]() |