![]() |
![]() |

``ఏక్ బార్ ఏక్ బార్`` అంటూ `వినయ విధేయ రామ`(2019)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `ఐటమ్ గాళ్`గా స్టెప్పులేసిన హాట్ బ్యూటీ ఈషా గుప్తా.. త్వరలో చరణ్ కి విలన్ గా మారనుందా? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్దేశకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చరణ్ కి జంటగా `వినయ విధేయ రామ` నాయిక కియారా అద్వాని నటిస్తుండగా.. జయరామ్, శ్రీకాంత్, అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టిన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ సురేశ్ గోపి, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా నటించబోతున్నారట. అంతేకాదు.. భార్యాభర్తలుగా వీరి పాత్రలు ఉంటాయని.. ఇద్దరు కూడా ఈ సినిమాలో నెగటివ్ రోల్స్ లో కనిపిస్తారని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`#RC 15` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కాబోతోందని సమాచారం.
![]() |
![]() |