![]() |
![]() |
(1).jpg)
అక్కినేని నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని ఒక తల్లి బిడ్డలు కాదు. నాగ్ మొదటి భార్య లక్ష్మి కుమారుడు చైతూ కాగా, రెండో భార్య అమల తనయుడు అఖిల్. అయినప్పటికీ సవతి సోదరుల్లా కాకుండా సొంత అన్నదమ్ముల్లాగే మెసలుతుంటారు చైతూ, అఖిల్. లేటెస్ట్‌గా ఆ అన్నదమ్ముల అనుబంధం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మరింత బలంగా ఆవిష్కృతమయింది. ఇటీవల చైతూ సినిమా 'లవ్ స్టోరి' విడుదలై, మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సమంత, తాను భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు చైతూ ప్రకటించాడు.
విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య పాల్గొన్న తొలి పబ్లిక్ ఈవెంట్ కావడంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రి రిలీజ్ ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిల్ టైటిల్ రోల్ చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఈనెల 15న దసరా పర్వదినం రోజున థియేటర్లలో విడుదలవుతోంది. అయితే ఈ ఈవెంట్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి అసలు మాట్లాడకుండా జాగ్రత్తపడ్డాడు చైతూ.
ఆ విషయం అలా ఉంచితే అఖిల్ మూవీ ఈవెంట్‌కు చైతూ ఒక్కడే చీఫ్ గెస్ట్‌గా రావడమనేది ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ ఎంత బలంగా ఉందో ఈ ఈవెంట్ నిదర్శనంగా నిలిచింది.
మొదట మాట్లాడిన అఖిల్, "లవ్ స్టోరి మూవీతో థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయొచ్చనే హోప్ ఇచ్చారు. మా బ్రదర్‌కు థాంక్యూ చెప్పాలి. కొవిడ్ టైమ్స్‌లో ఇలాంటి అడుగు వెయ్యడానికి ధైర్యం కావాలి. 'లవ్ స్టోరి' టీమ్ అందరికీ కంగ్రాట్స్, థాంక్స్ చెప్తున్నాను.. ఎప్పుడో ఒక ఈవెంట్‌కు వెళ్లాను. సడన్‌గా జనంలోంచి ఎవరో అరిచారు, 'చుక్కల్లో చంద్రుడు.. చైతూ బాబు తమ్ముడు' అని. రండి బ్రదర్ రండి.." అని చైతూను స్టేజ్ మీదకు ఆహ్వానించాడు అఖిల్.
.jpg)
చైతన్య మాట్లాడుతూ, "అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా ఆ సినిమాకి ప్రిపేరయ్యే ప్రాసెస్‌ని ఎక్కువ ప్రేమిస్తాడు. అఖిల్‌లో అది నాకు బాగా ఇష్టం. వచ్చే నాలుగైదేళ్ల కాలంలో ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అనేది ఆల్‌రెడీ అతని మైండ్‌లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. తను ఎలాగైనా అది చేసే తీరతాడు. తనలో ఉన్న డెడికేషన్ అది. నాకెందుకో అఖిల్ 'సిసింద్రీ'లో అలా పాక్కుంటూ వచ్చే సీనే గుర్తుకు వస్తుంటుంది. ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే నాకు డైజెస్ట్ కావడం కష్టంగా ఉంది. కానీ ఈరోజు అతనున్న స్థాయిని చూసి గర్వపడుతున్నా. ప్రతిరోజూ ఇంట్లో నేను కొత్త అఖిల్‌ను చూస్తుంటాను. తన ఫిజిక్ అయినా, తన బాడీ లాంగ్వేజ్ అయినా.. ఒక సినిమాకి అంతగా డెడికేట్ అవుతాడు. అతన్ని చూసి సంతోషపడుతున్నా" అని చెప్పాడు.
ఇలా అక్కినేని బ్రదర్స్ మధ్య వెల్లివెరిసిన అనుబంధం చూసి అక్కడున్న వాళ్లు, అక్కినేని అభిమానులు చాలా సంతోషపడ్డారు. అఖిల్ చెప్పిన "చుక్కల్లో చంద్రుడు.. చైతూ బాబు తమ్ముడు" అనే డైలాగ్ వారికి మరీ మరీ నచ్చింది.
![]() |
![]() |