![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే ఆదివారం (అక్టోబర్ 10) జరుగుతున్నాయ్. ఈ ఎన్నికల్లో ఒకవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మరోవైపు మంచు విష్ణు ప్యానల్ నువ్వా, నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ, రచ్చరచ్చ చేసుకుంటూ ఈ ఎన్నికలను హీటెక్కిస్తున్నారు. పొలిటికల్ ఎలక్షన్స్ తరహాలో పోటీలో ఉన్నవాళ్లు మేనిఫెస్టోలను రిలీజ్ చేయడం గమనార్హం.
కాగా నగరి ఎమ్మెల్యే, నటి రోజా ఈ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకుంటానని చెప్పారు. "మా మెంబర్‌గా కచ్చితంగా మా ఎన్నికల్లో నేను పాల్గొంటాను. 'మా'ను అభివృద్ధి చేయడానికి ఎవరేం చేస్తామన్నది మేనిఫెస్టోను విడుదల చేశారు కాబట్టి, వాటిలో 'మా' సభ్యులకు ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో, వారికే ఓటు వేస్తాను" అన్నారు రోజా.
"మీ ఓటు లోకల్‌కా, నాన్ లోకల్‌కా?" అనే ప్రశ్న వేసినప్పుడు, "ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ నన్ను అడగవద్దండీ. ఈరోజు 'మా' ఎన్నికలనేవి మా పొలిటికల్ ఎలక్షన్స్ కంటే చాలా వాడిగా, వేడిగా జరుగుతున్నాయ్. కాబట్టి దాంట్లో నేను వేలు పెట్టాలనుకోవట్లేదు. కానీ ఓ ఆర్టిస్టుగా నా ఓటును మాత్రం కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను" అని రోజా చెప్పారు.
![]() |
![]() |