![]() |
![]() |

2019లో విడుదలైన `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. కట్ చేస్తే.. రెండేళ్ళ విరామం అనంతరం `గని`తో హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా దర్శనమివ్వబోతున్నాడు వరుణ్ తేజ్. కాగా, దీపావళి కానుకగా విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. డిసెంబర్ 3కి వాయిదా పడింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన `గని` ఫస్ట్ పంచ్ వీడియోలో ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. డిసెంబర్ లో ఇప్పటివరకు ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించాడు వరుణ్ తేజ్. వాటిలో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ ముంగిట మురిపించలేకపోయింది. తన తొలి చిత్రం `ముకుంద`(2014 డిసెంబర్ 24)తో పాటు `లోఫర్` (2015 డిసెంబర్ 17), `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్`(2018 డిసెంబర్ 28).. ఇలా మూడు వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్ మాసంలో సందడి చేసిన వరుణ్ కి.. ఆయా సందర్భాల్లో నిరాశజనక ఫలితాలే దక్కాయి. ఈ నేపథ్యంలో.. నాలుగోసారైనా డిసెంబర్ నెల వేదికగా వరుణ్ ని విజయం వరిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. తమన్ స్వరకల్పనలో రూపొందుతున్న `గని`లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ కి జంటగా సయీ మంజ్రేకర్ సందడి చేయనుంది.
![]() |
![]() |