![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే.. `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్`, శంకర్ డైరెక్టోరియల్. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో అగ్ర దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలే. కొరటాల శివ రూపొందిస్తున్న `ఆచార్య`లో మెగాస్టార్ చిరంజీవితోనూ.. రాజమౌళి తీర్చిదిద్దుతున్న `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చరణ్. శంకర్ సినిమాలో మాత్రం సోలో హీరోగానే దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూడు బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి కూడా స్టార్ కంపోజర్స్ స్వరాలు సమకూర్చుతున్నారు. విశేషమేమిటంటే.. వారందరితోనూ గతంలో విజయాలు చూసిన చరణ్.. ఐదేళ్ళు, అంతకుమించి గ్యాప్ తో వారితో మళ్లీ జట్టుకట్టడం వార్తల్లో నిలుస్తోంది. `ఆచార్య` సంగతే తీసుకుంటే.. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. చరణ్ తొలి చిత్రం `చిరుత`(2007)తో పాటు నాలుగో సినిమా `రచ్చ`(2012)కి మణి బాణీలు అందించారు. ఆ రెండు చిత్రాల విజయంలో భాగమయ్యారు. `రచ్చ` తరువాత మళ్ళీ తొమ్మిదేళ్ళ తరువాత `ఆచార్య` కోసమే ఈ ఇద్దరు టీమ్ అప్ అయ్యారు.
ఇక చరణ్ తొలి ఇండస్ట్రీ హిట్ `మగధీర` (2009)కి కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఆ తరువాత మళ్ళీ కలిసి పనిచేసింది లేదు. `ఆర్ ఆర్ ఆర్` కోసం పుష్కరకాలం తరువాత ఈ ఇద్దరు టీమ్ అప్ అయ్యారు. అలాగే `నాయక్` (2013) వంటి బ్లాక్ బస్టర్ కోసం చరణ్ తో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేసిన తమన్.. ఆపై `బ్రూస్ లీ` (2015) కోసం సెకండ్ టైమ్ జట్టుకట్టాడు. ఆ తరువాత మరే సినిమా వీరి కాంబోలో రాలేదు. మళ్ళీ శంకర్ చిత్రం కోసమే ఆరేళ్ళ తరువాత టీమ్ అప్ అయ్యారు. మరి.. చాన్నాళ్ల తరువాత మణిశర్మ, కీరవాణి, తమన్ తో చరణ్ చేస్తున్న ఈ రీ-యూనియన్ మూవీస్.. బాక్సాఫీస్ ముంగిట సక్సెస్ ఫుల్ వెంచర్స్ గా నిలుస్తాయేమో చూడాలి.
![]() |
![]() |