![]() |
![]() |
.jpg)
పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. 'రిపబ్లిక్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో జగన్ సర్కార్ పై పవన్ విమర్శలు చేయడం.. దానికి కౌంటర్ గా పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద విరుచుకుపడటంతో రచ్చ మొదలైంది. ఆ తరువాత తనకు పవన్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్, అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయి అంటూ పోసాని మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు దాడికి యత్నించారు. ఇక బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోసాని ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారు. దీంతో పోసాని మరోసారి నోటికి పని చెప్పారు.
తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులేనని పోసాని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ ను ఎందుకు తిడుతున్నారని అడిగితే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతాను. మహా అయితే.. ఏమి చేస్తారు నన్ను చంపేస్తారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కు ఆవేశం తప్ప ఆలోచనలేదని.. డబ్బులు ఇచ్చి మరీ రాళ్లదాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. పవన్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని.. ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా పవన్ ను ఎవరైనా ఏమైనా అంటే కొట్టేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కోడైరెక్టర్ ను ఇలానే చొక్కా పట్టుకొని ఆవేశంలో కొట్టాడని.. ఆ తర్వాత అతడి తప్పు లేదని తెలిసినా సారీ చెప్పలేదని తెలిపారు.
రాజకీయంగా తనను ఏమన్నా పట్టించుకోనని.. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకున్నా తన భార్యను తిడుతున్నారని.. అయినప్పటికీ చిరంజీవి స్పందించకపోవడం బాధాకరమన్నారు. అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు.. చిరు ఫ్యామిలీని కొంత మంది తిడితే తాను ఫైట్ చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తమ్ముడు దాడులు చేయిస్తుంటే చిరంజీవి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని పోసాని ప్రశ్నించారు.
![]() |
![]() |