Home  »  News  »  నాది కృష్ణుని పాత్ర.. మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను

Updated : Sep 29, 2021

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు అక్టోబర్ 10 న జరగనున్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పోరు ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల నడుమ జరుగనుంది. ఇప్పటికే ఇద్దరూ తమ ప్యానల్స్ ని ప్రకటించి.. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మంచు విష్ణు.. తాజా మాజీ మా అధ్యక్షుడు నరేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణుకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు నరేష్ ప్రకటించారు.

మంచు విష్ణు అయితేనే 'మా'కు పర్ఫెక్ట్ గా సరిపోతాడని నరేష్ చెప్పారు. నా తర్వాత మాకి మంచి అధ్యక్షుడిని అందించడం నా బాధ్యత.. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే మా వైభవం కోల్పోతుంది అన్నారు. మంచు విష్ణు ఒక బ్రాండ్.. అందరికీ అందుబాటులో ఉంటాడు.. మా అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు అని చెప్పుకొచ్చారు. నాది కృష్ణుని పాత్ర.. మా కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను.. విష్ణుకి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను అని నరేష్ తెలిపారు. 

ఎవరు పడితే వారు 'మా' సీటులో కూర్చుంటే పదవి మసకబారుతుందని నరేష్ అన్నారు. పదవి వ్యామోహాలు మాలో వుండకూడదన్నారు. పదవితో సంబంధం లేకుండా శివ బాలాజీ, రాజీవ్‌ కనకాల, లక్ష్మీకాంతరావు మంచి పనులు చేశారని కొనియాడారు. కరోనా సమయంలో మా శాయశక్తుల సభ్యులకు సేవ చేసామని చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనులు చేసామని.. ఈ మూడు ఏళ్లలో 'మా' ముందుకు పోయింది కానీ మసక బారాలేదని నరేష్ పేర్కొన్నారు.
 
మా తరఫున మేం 16 కుటుంబాలకి 24 గంటల్లో జీవితా బీమా చెక్కులు అందించామని నరేష్ తెలిపారు. మా భవనం తర్వాతి సంగతి.. ముందు మనుషులు బతకాలి కదా అనుకొని అలా చేశామని చెప్పారు. "మా భవనం నేను కడుతున్నా.. కావాల్సిన స్థలం చూశా అని విష్ణు ఇటీవల చెప్పాడు. వెంటనే బాలకృష్ణ.. విష్ణుకు ఫోన్‌ చేసి మాట్లాడి నేనున్నానన్నారు. సంతోషం అనిపించింది. ఇప్పుడు చూస్తే మిగిలినవారెవరూ భవనం గురించి మాట్లాడటం లేదు" అని నరేష్ అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.