![]() |
![]() |

ఈతరం అగ్ర దర్శకుల్లో పూరీ జగన్నాథ్ తీరే వేరు. జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తుంటారాయన. అందుకే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడేసి సినిమాలతోనూ పలకరించగలిగారు పూరి. అయితే, ఇదంతా రెండేళ్ళ క్రితం మాట. కరోనా ఎఫెక్ట్.. పూరి పని తీరుపై కూడా బాగానే ప్రభావం చూపింది. అందుకే.. ఫస్ట్ టైమ్ ఆయన తీస్తున్న పాన్ - ఇండియా మూవీ `లైగర్`.. కరోనా ఎఫెక్ట్ తో సుదీర్ఘ కాలంగా సెట్స్ పై ఉన్న సినిమాగానే వార్తల్లో నిలుస్తోంది. 2019లోనే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్.. 2021లోనూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం లేదు.
పూరి బర్త్ డే సందర్భంగా `లైగర్` కథానాయకుడు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ప్రకారం.. వచ్చే ఏడాది వరకు ఈ చిత్రం కోసం వేచిచూడక తప్పదన్నది స్పష్టమైంది. అదే గనుక జరిగితే.. 2000 నుండి 2019 వరకు ప్రతీ ఏడాది తన సినిమాలతో సందడి చేస్తూ వస్తున్న పూరికి 2020, 2021 `జీరో రిలీజ్ ఇయర్స్` కిందే లెక్క. ఏదేమైనా.. పూరి మేకింగ్ స్టైల్ కి ఫిదా అయ్యే ప్రత్యేక అభిమాన గణానికి ఇది కూసింత నిరాశ కలిగించే అంశమే.
మరి.. `ఇస్మార్ట్ శంకర్` తరువాత రెండున్నరేళ్ళకు పైగా గ్యాప్ తో రాబోతున్న `లైగర్`.. ఆ గ్యాప్ ని మరిపించే స్థాయిలో మురిపిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |