![]() |
![]() |

`బాహుబలి` సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. త్వరలో ఆయన `ఆర్ ఆర్ ఆర్`తో పలకరించబోతున్నారు. చారిత్రక పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ లో అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నారు. రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
ఇదిలా ఉంటే, అక్టోబర్ 10.. రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `ఆర్ ఆర్ ఆర్` యూనిట్ ఓ స్పెషల్ వీడియోని ప్లాన్ చేసిందని బజ్. అలాగని, ఇది టీజరో, ట్రైలర్ నో కాదు. ఓ మేకింగ్ వీడియో అట. ఇప్పటికే ఓ మేకింగ్ వీడియోతో ఆకట్టుకున్న `ఆర్ ఆర్ ఆర్` టీమ్.. సెకండ్ మేకింగ్ వీడియోతోనూ ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి. అంతేకాదు.. ఆ వీడియోలో `ఆర్ ఆర్ ఆర్` న్యూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో ఆలియా భట్, ఓలివియా మోరీస్ నాయికలుగా నటించగా అజయ్ దేవగణ్, శ్రియ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు.
![]() |
![]() |