సీనియర్ హీరో శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం `పెళ్ళి సందడి` (1996). పాతికేళ్ళ క్రితం విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడదే `పెళ్ళి సందడి` టైటిల్ ని మరోసారి రిపీట్ చేస్తూ శ్రీకాంత్ తనయుడు రోషన్ కొత్త సినిమా చేశాడు. నాటి `పెళ్ళి సందడి`కి బాణీలు కట్టిన స్వరవాణి కీరవాణి.. నేటి `పెళ్ళి సందడి`కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం. అలాగే అప్పటి `పెళ్ళి సందడి`కి దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.. ఇప్పటి `పెళ్ళి సందడి`కి దర్శకత్వ పర్యవేక్షణ వహించడమే కాకుండా ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రచార చిత్రాలతో, పాటలతో ఇప్పటికే ఇంప్రెస్ చేసిన నయా `పెళ్ళి సందడి`ని దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. శ్రీకాంత్ `పెళ్ళి సందడి` 1996 సంక్రాంతికి భారీ చిత్రాల నడుమ విడుదలై అఖండ విజయం సాధిస్తే.. రోషన్ `పెళ్ళి సందడి` కూడా 2021 దసరా సీజన్ లో అదే తరహాలో ఎంటర్టైన్ చేయనుంది. అంటే.. తండ్రీతనయుల `పెళ్ళి సందడి` చిత్రాలు.. ఫెస్టివల్ సీజన్స్ నే టార్గెట్ చేశాయన్నమాట. మరి.. శ్రీకాంత్ అలాగే రోషన్ కూడా ఫెస్టివల్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.