Home

»

Latest News

'రిప‌బ్లిక్‌' ట్రైల‌ర్‌ విడుద‌ల చేసిన మెగాస్టార్.. ట్రైల‌ర్ చూస్తే గూజ్‌బంప్స్!

Sep 22, 2021 11:36AM

సాయిధరమ్‌ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రిపబ్లిక్‌'. అక్టోబర్‌ 1న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'రిపబ్లిక్‌' ట్రైలర్‌ ను బుధవారం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

సాయితేజ్‌ కలెక్టర్‌ పాత్రలో కనిపిస్తున్న 'రిపబ్లిక్‌' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌' అంటూ సాయితేజ్ చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తోంది. అవినీతి రాజ‌కీయ నాయ‌కులకు, నిజాయ‌తీకి మారు పేరైన ఓ యువ క‌లెక్ట‌ర్‌ కు మధ్య జ‌రిగే పోరాట‌మే రిప‌బ్లిక్ సినిమా అని ట్రైల‌ర్ చూస్తే అర్థమవుతోంది. 'మీ భ‌యం, అజ్ఞానం, అమాయ‌క‌త్వం, విశ్వాస‌మే ఆ సింహాస‌నానికి నాలుగు కాళ్లు'.. 'అజ్ఞానం గూడు క‌ట్టిన చోటే మోసం గుడ్డు పెడుతుంది' వంటి పవర్ ఫుల్ డైలాగ్స్, మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కు మేజ‌ర్ ఎసెట్‌ గా నిలిచాయి.

ట్రైలర్ విడుదల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "సాయి తేజ్ ఆ భ‌గ‌వంతుడు దీవెన‌లు, ప్రేక్ష‌కాభిమానులందరి ఆశీస్సుల‌తో హాస్పిట‌ల్‌ లో త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే మ‌న మ‌ధ్య‌కు వ‌స్తాడు. రిప‌బ్లిక్ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే నాకు గూజ్‌బంప్స్ వ‌స్తున్నాయి. ఓ యంగ్ క‌లెక్ట‌ర్ రౌడీయిజాన్ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎన్నుకోవాలో తెలియ‌జేప్పే ప్ర‌య‌త్నం చూస్తుంటే అంద‌రినీ ఎడ్యుకేట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది. సాయితేజ్ డైన‌మిక్‌గా, సెటిల్డ్‌గా క‌నిపిస్తున్నాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది." అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com