![]() |
![]() |

కరోనా కష్ట కాలంలో ఎందరికో అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. అయితే తాజాగా ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించిజరిపినట్లు తెలుస్తోంది.
ముంబైలోని సోనూసూద్ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. అలాగే ముంబైలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లక్నోలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సోను సూద్ కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల కుదిరిన ఓ డీల్ అంశంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టారని ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సోనూసూద్ మీటింగ్ జరిగిన రోజుల వ్యవధిలోనే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న 'దేశ్ కా మెంటార్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసడర్ గా సోనూసూద్ ను కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో సోనూసూద్ చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, మంచిపని చేయడానికి రాజకీయాల్లోనే చేరాల్సిన పనిలేదని సోనూసూద్ వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా 'దేశ్ కా మెంటార్' కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన కొద్ది రోజులకే ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
![]() |
![]() |