![]() |
![]() |

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. `ఆనంద్`(2004) మొదలుకుని `ఫిదా`(2017) వరకు శేఖర్ రూపొందించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అలాంటి ఈ సెన్సిబుల్ డైరెక్టర్ నుంచి నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం, `ఫిదా` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మరో ఫీల్ గుడ్ మూవీ వస్తోంది. అదే.. `లవ్ స్టోరి`. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా.. ఈ నెల 24న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. శేఖర్ కమ్ముల రూపొందించే చిత్రాల్లో సింహభాగం రెండున్నర గంటలకి పైగా నిడివితో సాగేవే. తన ప్రీవియస్ మూవీ `ఫిదా` మాత్రమే కేవలం 134 నిమిషాలు (2 గంటల 14 నిమిషాలు) నడిచింది. ఒకరకంగా.. ఆ క్రిస్ప్ రన్ టైమ్ కూడా సినిమాకి ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే, `లవ్ స్టోరి` మాత్రం 165 నిమిషాల (2 గంటల 45 నిమిషాలు) డ్యూరేషన్ తో తెరకెక్కిందని వినికిడి. గతంలో సరిగ్గా ఇంతే నిడివితో శేఖర్ తీసిన `హ్యాపీ డేస్` (2007) బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించింది. మరి.. `హ్యాపీ డేస్` బాటలోనే `లవ్ స్టోరి` కూడా వెళుతుందేమో చూడాలి.
![]() |
![]() |