![]() |
![]() |

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వాకబు చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన చంద్రబాబు.. సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా చంద్రబాబు తెలియజేశారు.
చిరంజీవి మేనల్లుడు సాయిధ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కి చంద్రబాబు ఫోన్ చేసి.. సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా రోడ్డు ప్రమాదంలో సాయి తేజ్ కు కాలర్ బోన్ విరిగింది. ఆదివారం ఆయనకు సర్జరీ నిర్వహించారు. సాయి తేజ్ కు నిర్వహించిన కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తైందని అపోలో డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.
![]() |
![]() |