![]() |
![]() |

హాలీవుడ్ నటి, సింగర్ బ్రిట్నీ స్పియర్స్ సంచలన ప్రకటన చేసింది. 39 ఏళ్ల బ్రిట్నీ.. తన బాయ్ ఫ్రెండ్ శామ్ అస్ఘరీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు తెలిపింది. ఇన్స్టాగ్రామ్ లో వీడియో ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
బ్రిట్నీ స్పియర్స్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది నేనే నమ్మలేకపోతున్నానంటూ కామెంట్ పెట్టింది. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఆమె తన ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించింది. 'రింగ్ నీకు నచ్చిందా?' అని ఆమె ప్రియుడు అడగగా.. ఆమె 'ఎస్' అంటూ సమాధానం ఇచ్చింది. బ్రిట్నీ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్ లు వచ్చాయి.

కాగా, బ్రిట్నీ ప్రియుడు శామ్ కూడా నటుడే కావడం గమనార్హం. 2016లో ఓ మ్యూజిక్ వీడియో సందర్భంగా పరిచయమైన వీరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.
![]() |
![]() |