![]() |
![]() |

మరో వారం రోజుల్లో `మాస్ట్రో`గా పలకరించబోతున్నాడు యూత్ స్టార్ నితిన్. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 17న ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్ట్రీమ్ కానుంది. కాగా, `మాస్ట్రో` జనం ముందుకు రాకముందే ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఆ చిత్రమే.. `మాచర్ల నియోజకవర్గం`. ఎస్.ఆర్. శేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో నితిన్ కి జంటగా `ఉప్పెన` భామ కృతి శెట్టి సందడి చేయనుంది. నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని.. ఇందులో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు.. విలన్ పాత్ర కూడా ఎంతో శక్తిమంతంగా ఉంటుందని.. ఓ ప్రముఖ నటుడు ఆ పాత్రలో దర్శనమివ్వనున్నారని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, 2022 ప్రథమార్ధంలో `మాచర్ల నియోజకవర్గం` విడుదల కానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నితిన్ కి ఎలాంటి గుర్తింపుని, ఫలితాన్ని అందిస్తుందో చూడాలి మరి.
![]() |
![]() |