![]() |
![]() |
.jpg)
రామ్‌చరణ్ మరదలు, ఉపాసన చెల్లెలు అయిన అనుష్పాల కామినేని తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీమ్‌తో ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. శోభన కామినేని, అనిల్ కామినేని దంపతుల చిన్న కుమార్తె అయిన అనుష్పాల ప్రస్తుతం అపోలో గ్రూప్‌కు వెస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. కొంత కాలంగా అర్మాన్ ఇబ్రహీమ్‌తో ఆమె డేటింగ్‌లో ఉంది. ఇటీవల వారి నిశ్చితార్ధం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య సందడిగా జరిగింది.
తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అదివరకే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారు తెలియజేసినప్పటికీ, లాంఛనంగా ఆ వేడుకను జరుపుకోవాలని వారు డిసైడ్ చేసుకున్నారు. ఆత్మీయంగా జరిగిన వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్పాల వైట్ ఫ్లోరల్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్‌తో గార్జియస్‌గా కనిపిస్తే, వైట్ కుర్తా, వైట్ పైజమాలో ఆకట్టుకున్నాడు. అనుష్పాల ధరించిన ఆభరణాలు కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి. డైమండ్ అండ్ బ్లూ సఫైర్ చెవి రింగులు, మ్యాచింగ్ నెక్లెస్, ముక్కుపుడక, వజ్రాలు పొదిగిన గాజులను ఆమె ధరించింది.

ఇంతకీ అర్మాన్ ఇబ్రహీం ఎవరంటే.. మాజీ ఇండియన్ ఫార్ములారేస్ చాంపియన్ అయిన అక్బర్ ఇబ్రహీమ్ కుమారుడు. కార్టింగ్‌లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన అర్మాన్.. 2004లో ఫార్ములా ఎల్జీబీ చాంపియన్‌గా అవతరించాడు. ఆ తర్వాత అతను 2005 సీజన్‌లో ఫార్ములా బీఎండబ్ల్యు ఏషియాకు మారాడు. కొద్ది రోజుల క్రితం అనుష్పాల, అర్మాన్‌ల ఎంగేజ్‌మెంట్ సందర్భంగా ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఫొటోలను షేర్ చేసింది ఉపాసన.

![]() |
![]() |