![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `రేసు గుర్రం` (2014), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో `ధృవ` (2016), మెగాస్టార్ చిరంజీవితో `సైరా.. నరసింహారెడ్డి` (2019) రూపొందించి మెగా కాంపౌండ్ లో మంచి విజయాలను అందుకున్నారు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి. త్వరలో ఈ వెర్సటైల్ కెప్టెన్.. మరో మెగా క్యాంప్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జట్టుకట్టనున్నారు. `యథా కాలమ్.. తథా వ్యవహారమ్..` అనే ట్యాగ్ తో ఈ సినిమా రాబోతోంది. 2022 ద్వితీయార్ధంలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023 ఆరంభంలో తెరపైకి వచ్చే అవకాశముంది. ఈలోపు అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో `ఏజెంట్`తో ఎంటర్టైన్ చేయబోతున్నారు సూరి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆరంభంలో థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. అఖిల్, పవన్ చిత్రాల నడుమ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారట సురేందర్ రెడ్డి. యూత్ స్టార్ నితిన్ కాంబినేషన్ లో చేయబోయే ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుందని.. నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ తో కలిసి సూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని బజ్. అంతేకాదు.. 2022 ఆరంభంలో పట్టాలెక్కే ఈ సినిమాని.. మూడు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక జరుగుతోందని వినికిడి. మరి.. ఫస్ట్ నితిన్ - నెక్స్ట్ పవన్ అన్నట్లుగా సూరి వేసిన ఈ స్కెచ్ ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |