Home  »  News  »  అఖిల్ కి షాక్ ఇచ్చిన తమన్!

Updated : Sep 3, 2021

'అఖిల్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన అఖిల్ అక్కినేని మొదటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలేవీ సరైన విజయాన్ని సాధించకపోవడంతో తన తదుపరి సినిమాలపైన అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తోంది.

'ఏజెంట్' మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా తమన్ తన మ్యూజిక్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' మూవీ తర్వాత తమన్ స్థాయి మారిపోయింది. స్టార్స్ సైతం తమన్ తో మ్యూజిక్ చేయించాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం తమన్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలను ఒప్పుకున్న తమన్.. 'ఏజెంట్' మూవీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నాడట. అందుకే ఈ మూవీ నుంచి తమన్ తప్పుకున్నాని ప్రచారం జరుగుతోంది. 

తమన్ తప్పుకోవడంతో.. అతడి స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ త‌మీజాను తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. కాగా గతంలో సురేందర్ రెడ్డి-హిప్ హాప్ త‌మీజా కాంబినేషన్లో వచ్చిన 'ధృవ' మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.