![]() |
![]() |

ఇన్నాళ్ళు అనువాదాలతోనే అలరిస్తూ వచ్చిన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.. త్వరలో తెలుగులో నేరుగా ఓ సినిమాతో పలకరించనున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెల ప్రథమార్ధంలో ప్రారంభించనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. 2022 జూలై నాటికి చిత్రీకరణ పూర్తిచేసే దిశగా శంకర్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టి.. 2023 సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, చరణ్ ప్రస్తుతం `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరోవైపు `ఆర్ ఆర్ ఆర్` రీసెంట్ గా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ రెండు భారీ బడ్జెట్ మూవీస్ కూడా తక్కువ గ్యాప్ లోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.
![]() |
![]() |