![]() |
![]() |

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాక.. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేస్తున్నారు వెర్సటైల్ స్టార్ జగపతి బాబు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన జగ్గూ భాయ్.. త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సందడి చేయబోతున్నారు. అది కూడా.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో.
ఆ వివరాల్లోకి వెళితే.. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి `రాధే శ్యామ్`, `సలార్`, `ఆది పురుష్` రూపంలో ముచ్చటగా మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో `ఆది పురుష్` కంటే ముందే రాబోతున్న `రాధే శ్యామ్`, `సలార్`లో జగపతి బాబు ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `రాధే శ్యామ్`లో జగ్గూభాయ్ చేస్తున్న పాత్రపై క్లారిటీ రాకపోయినా.. `సలార్`లో మాత్రం రాజమన్నార్ గా బ్యాడీగా ఎంటర్టైన్ చేయనున్నారాయన. మరి.. ప్రభాస్ తో చేస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో జగపతి బాబు ఎలాంటి గుర్తింపుని పొందుతారో చూడాలి.
![]() |
![]() |