![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రేపు రాత్రి నుంచి మొదలవనున్నాయి. సెప్టెంబర్ 2 ఆయన బర్త్‌డే అనే విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమేం వస్తాయోనని ఫ్యాన్స్ అత్యంత కుతూహలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ముందుగా ప్రారంభమైనప్పటికీ, 'భీమ్లా నాయక్' ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'భీమ్లా నాయక్'ను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇంతకుముందు 'భీమ్లా నాయక్'గా కల్యాణ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ను రిలీజ్ చేసినప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 2న ఫ్యాన్స్‌ను మరింత అలరించేందుకు, వారిని ఉత్తేజితుల్ని చేసేందుకు టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మలయాళం సూపర్‌హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అయిన ఈ మూవీలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. సాగర్‌చంద్ర ఈ సినిమాకు దర్శకుడు.
పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మెగా సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మిస్తోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. రాబిన్‌హుడ్ తరహా క్యారెక్టర్‌లో ధనవంతులను దోచి, పేదలకు పంచిపెట్టే పాత్రలో కల్యాణ్ కనిపించే ఈ మూవీని క్రిష్ రూపొందిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి, చాలా రోజుల క్రిత వచ్చిన పవర్‌స్టార్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన బర్త్‌డేకి ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయని రీతిలో ఒక సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
'గబ్బర్ సింగ్' మూవీతో అప్పటికి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు పవన్ కల్యాణ్. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన హరీశ్ శంకర్.. మరోసారి తన అభిమాన హీరోను డైరెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో కల్యాణ్ జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారనే వార్త బయటకు వచ్చింది. పవన్ బర్త్‌డేకి దీన్ని అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు, పవన్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఉంటుందని వినిపిస్తోంది. అదే జరిగితే సెప్టెంబర్ 2 పవన్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగే అవుతుంది.
![]() |
![]() |