![]() |
![]() |

మాలీవుడ్ బాక్సాఫీస్ సెన్సేషన్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2`.. ఈ ఏడాది ఆరంభంలో ఓటీటీలో స్ట్రీమ్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫ్యామిలీ థ్రిల్లర్.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. `దృశ్యం` తెలుగు రీమేక్ లో నటించిన విక్టరీ వెంకటేశ్.. `దృశ్యం 2`లోనూ దర్శనమివ్వనున్నారు. అలాగే వెంకీకి జోడీగా మీనా, ఇతర ముఖ్య పాత్రల్లో నదియా, నరేశ్ కొనసాగుతున్నారు. `దృశ్యం` తెలుగు రీమేక్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా.. `దృశ్యం 2` తెలుగు రీమేక్ ని మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా వినాయక చవితి కానుకగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోందట. అంతేకాదు.. దసరా సీజన్ లో `దృశ్యం 2` జనం ముందు నిలుస్తుందని అంటున్నారు.
మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, `దృశ్యం 2`కి అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు.
![]() |
![]() |