![]() |
![]() |

సరోగేట్ మదర్ గా కృతి సనన్ నటించిన హిందీ చిత్రం `మిమి`. వినోదం, సందేశం మిళితమైన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయి వీక్షకాదరణ పొందింది. నటిగా కృతికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సంబంధించి రీమేక్ రైట్స్ సొంతం చేసుకుందని.. కేరళకుట్టి కీర్తి సురేశ్ ఈ రీమేక్ లో నటించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే `మిమి` రీమేక్ పై క్లారిటీ రానున్నది. మరి.. ఈ రీమేక్ తో కీర్తి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదివరకు ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌లో 'మహానటి' బిగ్ హిట్ అవడమే కాకుండా ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు తీసుకురాగా, 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' మూవీస్ సరిగా ఆడలేదు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేతిలో `అణ్ణాత్తే`, `సర్కారు వారి పాట`, `భోళా శంకర్` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వీటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా నటిస్తున్న `అణ్ణాత్తే` దీపావళికి విడుదల కానుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా దర్శనమివ్వనున్న `సర్కారు వారి పాట` సంక్రాంతి సీజన్ లో సందడి చేయనుంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అభినయిస్తున్న `భోళా శంకర్` 2022 ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
![]() |
![]() |