![]() |
![]() |

తమిళ అనువాదాలతో తెలుగువారికి చేరువైన కోలీవుడ్ హీరో.. కార్తి. తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్.. ఆ మధ్య కింగ్ నాగార్జున కాంబినేషన్ లో `ఊపిరి` (2016) అనే మల్టిస్టారర్ చేశాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందిన ఈ ఫీల్ గుడ్ బైలింగ్వల్ మూవీ.. తమిళంలో `తోళా` పేరుతో రిలీజైంది.
ఇదిలా ఉంటే.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కార్తి. ఈ సారి మరో సీనియర్ స్టార్ తో కలిసి నటించబోతున్నాడట ఈ హ్యాండ్సమ్ హీరో. ఆ స్టార్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేశ్. ఓ యువ దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తారని, ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని బజ్.
కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమా తెరకెక్కుతుందని.. 2022 ప్రథమార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలోనే వెంకీ, కార్తి మల్టిస్టారర్ పై క్లారిటీ రానున్నది. మరి.. నాగ్ కాంబినేషన్ లో చేసిన `ఊపిరి` తరహాలో.. వెంకీ కాంబినేషన్ మూవీతోనూ కార్తి ఇక్కడివారికి మరింత చేరువవుతాడేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం వెంకీ `దృశ్యం 2`, `ఎఫ్ 3` చేస్తున్నారు. ఇక కార్తి విషయానికి వస్తే.. `పొన్నియన్ సెల్వన్`, `సర్దార్` చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |