![]() |
![]() |

రెండు దశాబ్దాల క్రితం తెలుగునాట అగ్ర కథానాయికగా రాణించిన భూమికా చావ్లా.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. రీసెంట్ గా `పాగల్` చిత్రంలో హీరో తల్లిగా పాత్రలో మెరిసిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. త్వరలో `సీటీమార్` కోసం ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. భూమిక తాజాగా ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో స్పెషల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` చిత్రాల తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి తమన్ సంగీతమందిస్తున్నాడు.
కాగా, గత కొంతకాలంగా తన ప్రతీ చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ ని కీలక పాత్రలో నటింపజేస్తూ వస్తున్న త్రివిక్రమ్.. ఈ సినిమాలో కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఓ స్పెషల్ రోల్ కోసం భూమికని ఎంపిక చేశారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, భూమిక ఇదివరకు మహేశ్ కి జోడీగా `ఒక్కడు` (2003) చిత్రంలో నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సదరు యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. మళ్ళీ 18 ఏళ్ళ తరువాత మహేశ్ చిత్రంలో భూమిక కనిపించనుండడం ఆసక్తి రేకెత్తించే అంశమనే చెప్పాలి.
![]() |
![]() |