![]() |
![]() |
![]()
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ముచ్చటగా మూడు చిత్రాల్లో నటించిన నాయికగా కేథరిన్ ట్రెసాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. `ఇద్దరమ్మాయిలతో` (2013) కోసం బన్నీ, కేథరిన్ తొలిసారిగా జట్టుకట్టగా.. ఆపై `రుద్రమదేవి` (2015), `సరైనోడు` (2016)లోనూ ఈ ఇద్దరూ కనువిందు చేశారు. వీటిలో `సరైనోడు` ఘనవిజయం సాధించింది.
కట్ చేస్తే.. ఇప్పుడు కేథరిన్ తరహాలోనే మరో నాయిక అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడోసారి జోడీకట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే. `డీజే` (2017), `అల వైకుంఠపురములో` (2020) చిత్రాల్లో బన్నీకి జంటగా నటించిన ఈ సొగసరి.. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. `వకీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా `ఐకాన్` పేరుతో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్ గా పూజని ఎంపిక చేశారని టాక్. అదే గనుక నిజమైతే.. కేథరిన్ తరువాత బన్నీతో ముచ్చటగా మూడోసారి నటించే హీరోయిన్ పూజనే అవుతుంది. త్వరలోనే `ఐకాన్`లో పూజా హెగ్డే ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |