![]() |
![]() |

సంగీత దర్శకుడిగా జిబ్రాన్ ది పదేళ్ళ స్వరప్రస్థానం. ఈ ప్రయాణంలో తన మాతృభాష తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ భాషా చిత్రాలకు కూడా సంగీతమందించాడు జిబ్రాన్. ఒక దశలో లోక నాయకుడు కమల్ హాసన్ వరుస చిత్రాలకు కంపోజర్ గా పనిచేసిన జిబ్రాన్.. తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన `బాబు బంగారం`కి స్వరాలు సమకూర్చాడు. అలాగే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ - ఇండియా మూవీ `సాహో`కి నేపథ్య సంగీతమందించాడు.
ఇదిలా ఉంటే.. స్వల్ప విరామం అనంతరం మరో స్టార్ హీరో సినిమాకి బాణీలు అందించే అవకాశం దక్కిందట జిబ్రాన్ కి. ఆ వివరాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల అనంతరం తల అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంగీత దర్శకుడిగా జిబ్రాన్ ఎంపికయ్యాడని కోలీవుడ్ బజ్. గతంలో వినోద్ డైరెక్ట్ చేసిన `ధీరన్ అధికారమ్ ఒండ్రు` (తెలుగులో `ఖాకి`) చిత్రానికి జిబ్రాన్ సంగీతమందించాడు. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడీ సినిమా కోసమే మరోసారి వినోద్ తో పనిచేయనున్నాడు జిబ్రాన్. అంతేకాదు.. అజిత్ కాంబినేషన్ లో తనకిదే మొదటి సినిమా కావడం విశేషం. త్వరలోనే అజిత్ - వినోద్ థర్డ్ జాయింట్ వెంచర్ లో జిబ్రాన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |