![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ సూర్య మరో ఘనతను సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2021లో సుధ కొంగర డైరెక్ట్ చేసిన 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా నిలవగా, ఆ మూవీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సూర్య ఉత్తమ నటుడు అవార్డును గెలుపొందాడు. అతి తక్కువ ఖర్చుతో విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తూ ఎయిర్ దక్కన్‌ను నెలకొల్పిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించగా, జి.వి. ప్రకాశ్ సంగీతం సమకూర్చాడు.
సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'సూరారై పొట్రు' ఐఎఫ్ఎఫ్ఎంలో బెస్ట్ ఫిల్మ్ అవార్డును గెలుపొందింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ డిజైన్ నుంచి 'ఉర్సా మిని ప్రో 4.6కె జీ2'ను గెలుపొందడమే కాకుండా ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్ (AACTA అవార్డ్స్)లో బెస్ట్ ఏషియన్ ఫిల్మ్ కేటగిరీకి నామినేషన్ పొందింది.
పరేశ్ రావల్, మోహన్‌బాబు, ఊర్వశి, కరుణాస్ లాంటి పేరుపొందిన నటులు 'సూరారై పొట్రు'లో నటించారు. కొవిడ్ ఫస్ట్ లాక్‌డౌన్ టైమ్‌లో ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో 2020 నవంబర్ 12న విడుదలైంది. వీక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఫస్ట్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా పేరు తెచ్చుకుంది. అతి తక్కువ టైమ్‌లో కోట్లాది మంది ఈ సినిమాని తిలకించారు.
9.1 రేటింగ్‌తో ఐఎండీబీలో ఆల్ టైమ్ థర్డ్ హయ్యెస్ట్ రేటెడ్ మూవీగా నిలిచిన ఈ మూవీ, ఐఎండీబీలో హయ్యెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీగా ఉంది.
![]() |
![]() |