![]() |
![]() |

2021 దసరా.. స్వరవాణి కీరవాణికి వెరీ స్పెషల్ కానుందా? అవునన్నదే టాలీవుడ్ టాక్. ఎందుకంటే.. ఈ ఏడాది విజయదశమికి ఆయన సంగీతసారథ్యంలో రూపొందిన రెండు విభిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`కి కీరవాణి బాణీలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. దసరా స్పెషల్ గా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడదే సీజన్ లో `ఆర్ ఆర్ ఆర్`కి ముందు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతోంది. అదే.. వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ డైరెక్టోరియల్. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రసిద్ధ నవల `కొండపొలం` ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల కానుందట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దీనికి కూడా కీరవాణినే సంగీత దర్శకుడు. సో.. 2021 విజయదశమికి కీరవాణి డబుల్ ధమాకా ఉండబోతోందన్నమాట. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ మెగా కాంపౌండ్ హీరోలు (రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్) నటించడం.
మరి.. కీరవాణికి 2021 దసరా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
![]() |
![]() |