![]() |
![]() |

తెలుగమ్మాయిలు రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్.. వినాయక చవితి సీజన్ లో డబుల్ ధమాకా ఇవ్వనున్నారా? అవునన్నదే టాలీవుడ్ వర్గాల ఇన్ఫర్మేషన్.
ఆ వివరాల్లోకి వెళితే.. రీతూ వర్మ తాజాగా రెండు తెలుగు చిత్రాలను పూర్తిచేసింది. ఆ సినిమాలే `టక్ జగదీష్`, `వరుడు కావలెను`. నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన `టక్ జగదీష్` వేసవిలో విడుదల కావాల్సింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానుందట. కట్ చేస్తే.. అదే సమయంలో నాగశౌర్యకి జంటగా రీతూ నటించిన `వరుడు కావలెను` కూడా విడుదల కాబోతోందని టాక్.
ఇక ఐశ్వర్యా రాజేశ్ విషయానికి వస్తే.. తను సెకండ్ లీడ్ గా నటించిన `టక్ జగదీష్` వినాయక చవితికి రానుండగా.. మెయిన్ లీడ్ గా నటించిన మరో తెలుగు సినిమా `రిపబ్లిక్` కూడా అదే సీజన్ ని టార్గెట్ చేసిందట. `సుప్రీమ్` హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా జూన్ లో విడుదల కావాల్సింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.
మొత్తమ్మీద.. వినాయక చవితికి మన తెలుగమ్మాయిలు రీతూ, ఐష్ నుంచి డబుల్ ట్రీట్ ఉండబోతోందన్నమాట.
![]() |
![]() |