![]() |
![]() |

'నాంది' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేష్.. ఇటీవల 'సభకు నమస్కారం' అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో సతీష్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ గురువారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిమిస్తున్నారు. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా.. పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 'నాంది' డైరెక్టర్ విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు, డైలాగ్ రైటర్ గా అబ్బూరి రవి వర్క్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |