![]() |
![]() |

'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మెగా హీరో.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. 'కొండపొలం' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మరో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఉప్పెన్ విజయంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. మరి దేవి.. వైష్ణవ్ మూడో సినిమాకి కూడా ఆ స్థాయి మ్యూజిక్ అందిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |