![]() |
![]() |

వివాదాలంటే ఇష్టపడే వ్యక్తుల్లో తమిళ హీరో శింబు ఒకరు. తన వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. లేటెస్ట్‌గా మరోసారి అతను వార్తల్లో నిలిచాడు. నటి రోజా భర్త, పేరుపొందిన దర్శకుడు ఆర్.కె. సెల్వమణి అతనిపై ఫైర్ అవడం దీనికి కారణం!
రీసెంట్‌గా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ)తో అన్ని విధాలుగు తెగతెంపులు చేసుకుంటున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. 'ఫెఫ్సీ'లో సభ్యులుగా ఉన్నవారెవరితోనూ నిర్మాతలు పనిచేయకూడదని తీర్మానించింది. 'ఫెఫ్సీ'కి సెల్వమణి అధ్యక్షునిగా ఉన్నారు. ఫెఫ్సీకీ, ప్రొడ్యూసర్స్ కౌనిల్‌కు మధ్య గొడవకు ప్రధాన కారణం శింబు అని పేర్కొంటూ సెల్వమణి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు.
నలుగురు నిర్మాతలతో శింబుకు గొడవులున్నాయనీ, అవి పరిష్కారం అయ్యేంతదాకా శింబు సినిమాలకు సహకరించవద్దని ఫెఫ్సీకి ఓ నోటీస్ పంపింది ప్రొడ్యూసర్స్ కౌనిల్స్. ఆ నలుగురు నిర్మాతల్లో శింబుతో 'అన్బనవాన్ అసరధవాన్ అడంగధవాన్' (ఏఏఏ) సినిమా ప్రొడ్యూసర్ మైఖేల్ రాయప్పన్ కూడా ఉన్నారు.
ఫెఫ్సీకి, కౌన్సిల్‌కు మధ్య వివాదం తలెత్తడానికి ముఖ్య కారణమైంది శింబు కొత్త సినిమా 'వెందు తనిందదు కాడు'. చెన్నై బయట జరుగుతున్న తమ సినిమా షూటింగ్‌కు నాలుగు రోజుల పాటు ఫెఫ్సీ సభ్యుల్ని అనుమతించాల్సిందిగా ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇషారి గణేశ్ కౌన్సిల్‌కు లేఖ రాశారు. కానీ ఆ ప్రాజెక్టులో ఫెఫ్సీ మెంబర్స్ పనిచేయడంపై కౌన్సిల్ అసంతృప్తిగా ఉంది. అందుకే ఫెఫ్సీతో తెగతెంపులు చేసుకుంది.
![]() |
![]() |